Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కెల్విన్ కన్నా కీలకుడు డానియెల్... ఎంతో మంది ప్రముఖుల పిల్లల నగ్న చిత్రాలు సెల్ ఫోన్ లో... అరెస్ట్ చేయాల్సి వుందంటున్న సిట్!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ దందా కేసులో కెల్విన్ కన్నా, అతనికి సహాయకుడిగా ఉండి, దందాను ముందుండి నడిపించిన డానియెల్ అనే వ్యక్తి అత్యంత కీలకుడని, అతనిని అరెస్ట్ చేస్తేనే మరిన్ని వివరాలను వెలుగులోకి తేవచ్చని సిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో మంది ప్రముఖుల పిల్లలను డానియెల్ టార్గెట్ చేశాడని, వారంతా మైనర్లేనని, అతని సెల్ ఫోన్ కు అమ్మాయిల నగ్న చిత్రాలు వచ్చేవని, వాటిని కెల్విన్ కు ఫార్వార్డ్ చేసి, వారికి డ్రగ్స్ ఇవ్వాలని సిఫార్సు చేసేవాడని విచారణ వర్గాలు గుర్తించాయి.

డానియెల్ నుంచి పదుల కొద్దీ నగ్న వీడియోలు, చిత్రాలు కెల్విన్ కు రావడం, వారంతా పేరున్న వ్యక్తుల పిల్లలే కావడంతో ఈ కేసులో మరెన్ని విషయాలను చూడాల్సి వస్తుందోనని పోలీసులు విస్తుపోతున్న పరిస్థితి. డ్రగ్స్ కు అలవాటు పడిన అమ్మాయిలు, వాటి కోసం తమ చిత్రాలను తీసి పంపుతూ, వాటిని పోర్న్ సైట్లకు విక్రయించుకుని, ఆ డబ్బుతో మత్తుమందులు ఇవ్వాలని కోరుతుండటం గమనార్హం. ఈ డానియెల్ అన్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

More Telugu News